calender_icon.png 20 July, 2025 | 6:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్ధమాన్ కళాశాల విద్యార్థులకు తృటిలో తప్పిన పెనుప్రమాదం

19-07-2024 12:21:37 PM

రంగారెడ్డి: వర్థమాన్ విద్యార్థులకు తృటిలో తప్పిన పెను ప్రమాదం తప్పింది. శంషాబాద్ వర్ధమాన్ కళాశాలకు సంబంధించిన డ్రైవర్ నాగరాజు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో విద్యార్థులని తీసుకువెళ్తున్న బస్సులో కళాశాలకు వెళ్లే క్రమంలో ఒకసారిగా గుండె నొప్పితో కుప్పకూలిపోయాడుఒక్కసారిగా డ్రైవర్ కుప్పకూలడంతో విద్యార్థుల ప్రమతమైన విద్యార్థులు స్థానిక పిల్లర్ నెంబర్ 287 శివరాంపల్లి లోని శ్రీ చంద్ర ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను ప్రాణాలు విడిచినట్టు డాక్టర్లు వెల్లడించారు. నాగరాజు గత సంవత్సర కాలం నుంచి వర్ధమాన్ ఇంజనీరింగ్ కళాశాలలో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అత్తాపూర్ పోలీసులు డ్రైవర్ నాగరాజు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో నాగరాజు కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.