calender_icon.png 20 July, 2025 | 10:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాంబారులో పురుగు.. ఆందోళనలో విద్యార్థులు

19-07-2024 12:36:45 PM

డిచ్ పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయం బాలికల వసతిగృహంలో సాంబర్ లో పురుగు వచ్చింది. దీంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత నెల 21న అల్పాహారంలో బల్లి రాగా, నిన్న రాత్రి సాంబారులో పురుగు రావడంతో విద్యార్థినిలు ఆందోళ చెందుతున్నారు. పదే పదే ఇలానే జరుగుతుందంటూ, దీనిపై మరోసారి ఇలా జరగకుండా చర్యలు తీసుకోవాలని పై అధికారులకు ఫిర్యాదు చేశారు. తింటున్న భోజనంలో పురుగులు వస్తే విషయంబయటకు చెప్పొద్దని వార్డెన్, కేర్ టేకర్ భయపేడుతున్నారని ఆవేదన వ్యక్త ంచేశారు. తమ అల్పాహారం, భోజనంలో బల్లి, కప్ప, బొద్దింకలు రావడం సాధారణమైపోందని విద్యార్థులు పేర్కొన్నారు. ఇక నైనా ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త పడతారేమో చూడాలి.