calender_icon.png 10 May, 2025 | 5:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద బాధితులకు విరాళం ప్రకటించిన వరణ్ తేజ్

05-09-2024 04:08:28 PM

హైదరాబాద్: వరద బాధితుల సహాయార్థం మెగా ఫ్యామిలీ నుంచి భారీగా విరాళాలు అందుతున్నాయి. తాజాగా సినీ నటుడు వరుణ్ తేజ్ కూడా వరద సహయక చర్యలకు రూ.15 లక్షలు విరాళం ప్రకటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయనిధికి రూ.5 లక్షల చొప్పున విరాళం ప్రకటించిన వరణ్ తేజ్ ఏపీ పంచాయతీరాజ్ శాఖకు మరో రూ.5 లక్షలు విరాళం అందజేశారు. ఇప్పటికే సినీ పరిశ్రమ నుంచి చిరంజీవి, రాంచరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, విశ్వక్ సేన్, దర్శకుడు త్రివిక్రమ్, నాగార్జున విరాళాలు ప్రకటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు అల్లకల్లోలం అయ్యాయి.