09-11-2025 09:14:11 AM
కొల్లాపూర్ రూరల్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబసభ్యులతో కలిసి శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల పర్యాటక కేంద్రానికి హాజరయ్యారు. ముందస్తుగా ప్రజలు తనను గుర్తించకుండా అల్లు అర్జున్ మొహానికి మాస్క్ ధరించారు. నేరుగా కుటుంబ సభ్యులతో సోమశిల లోని వీఐపీ పుష్కర ఘాట్ వద్దకు కన్వాయ్ లో వ్యక్తిగత భద్రత సిబ్బందితో చేరుకున్నారు. అక్కడ ఏకో టూరిజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లాంచీలో కొద్దిసేపు అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో కలిసి నది అలలపై విహారిస్తూ ఆహ్లాదకరమైన ప్రకృతి వాతావరణాన్ని ఆస్వాదించారు. అకస్మాత్తుగా అల్లు అర్జున్ సోమశిలకు కుటుంబ సభ్యులతో రావడంతో టూరిజం సిబ్బంది ఒక్కసారిగా అవాక్కాయ్యారు. నదిలో బోటింగ్ చేస్తూ చుట్టూ ఎత్తయినా పచ్చని కొండలు, ప్రకృతి అందాలను వారు ఆస్వాదించారు. ఆ వెంటనే తిరిగి హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లారని స్థానిక టూరిజం సిబ్బంది తెలిపారు.