calender_icon.png 9 November, 2025 | 1:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి శిక్ష తప్పదు.!

09-11-2025 11:21:39 AM

జిల్లా ఎస్పీ గైక్వార్డ్ వైభవ్ రఘునాథ్

- డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వారికి జైలు శిక్షలు – జరిమానాలు

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): కల్వకుర్తి, ఊరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన వ్యక్తులపై కోర్టు కఠినంగా వ్యవహరించింది. కల్వకుర్తి జూనియర్ సివిల్ జడ్జి కావ్య జైలు శిక్షలు, జరిమానాలు విధించినట్లు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. కల్వకుర్తి పరిధిలోని గాంధీ నగర్ కి చెందిన కొంగరి గౌతమ్, తలకొండపల్లి మండలం మార్చాల కు చెందిన రాములులకు 3 రోజుల జైలు శిక్ష, రూ.500 జరిమానా, నాగర్ కర్నూల్  మున్సిపాలిటీ పరిధిలోని నాగనులు గ్రామానికి చెందిన శివకుమార్, ఎల్లికల్ గ్రామానికి చెందిన దాదమోని వెంకటయ్యకు ఒక రోజు జైలు శిక్ష, రూ.600 జరిమానా, నాగర్ కర్నూల్ పట్టణం రాంనగర్ కాలనీకి చెందిన

ఎం.డి. అల్తాఫ్ రూ.500 జరిమానా, సోషల్ సర్వీస్, 

కల్వకుర్తి జేపీ నగర్ కాలనీకి చెందిన మహబూబ్ పాషా రూ.1100 జరిమానా, సోషల్ సర్వీస్, ఊరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్ రెడ్డి పల్లి గ్రామానికి చెందిన సాంబ మల్లేష్ రూ.1000 జరిమానా, మాదారం గ్రామానికి చెందిన ఎన్. వెంకటేష్, రామ్ రెడ్డి పల్లి గ్రామానికి చెందిన కె. శేఖర్ రెడ్డిలకు రూ.1100 చొప్పున జరిమానా, ముచ్చర్లపల్లి గ్రామానికి చెందిన ఏ.మల్లయ్య రూ.1200 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.  ఇలాంటి వారి వాహనాల సీజ్‌తో పాటు కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.