22 July, 2026 | 1:59 AM

గండిపేటలో వరుణ జపం

22-07-2026 12:13 AM

జలాశయంలో చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుల పూజలు

మొయినాబాద్, జూలై 21 (విజయక్రాంతి): రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మంగళవారం ఉస్మాన్సాగర్ (గండిపేట) జలాశయంలో చిలుకూరు బాలాజీ దేవాలయం ఆధ్వర్యంలో వరుణ జపాన్ని నిర్వహించారు. చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ నేతృత్వంలో వేదపండితులు జలాశయంలో నడుము లోతు నీటిలో నిలబడి, వేద మంత్రోచ్ఛారణల మధ్య వరుణ జపాన్ని చేపట్టారు.

రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు తొలగి చెరువులు, జలాశయాలు నిండాలని, పంటలు బాగా పండి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి సమతుల్యత కోసం, వర్షాలు కురిసి ప్రజలకు మేలు జరగాలనే సంకల్పంతో ప్రతి ఏటా వైదిక సంప్రదాయం ప్రకారం ఈ వరుణ జపాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.