22 April, 2026 | 10:33 AM

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్స్‌కు ఘన సన్మానం

02-07-2025 12:41 AM

మణుగూరు, జూలై 1 ( విజయ క్రాంతి ) : వాసవి క్లబ్, వనిత వైభవం సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకల ను మంగళవారం మణుగూరు ప్రాథమిక వై ద్యశాలలో ఘనంగా నిర్వ హించారు. సందర్భంగా ప్రభుత్వ వైద్యులను, పట్టణానికి చెం దిన ప్రముఖ వైద్యులు డాక్టర్. ఇరుకుల్ల వెంకటేష్ ని ఘనంగా శాలువతో సత్కరించి, డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.

వాసవి క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ... రహదారి సౌకర్యం లేని మారుమూల ఆదివాసి గూడెలలో హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేసి సేవ లను అందిస్తున్న ఆరోగ్య కేంద్రం వైద్యుల సేవలను కొని యాడారు. వైద్యులు సేవాతత్పరత, ఔదార్యాని కి మారుపేరుగా నిలుస్తా రన్నారు. రోగుల ప్రాణాలను కాపాడడం కోసం వైద్యు లు చేస్తున్న కృషి అభినందనీయ మన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.