02-07-2025 12:43:15 AM
మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని సందర్శించిన ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ
భద్రాద్రి కొత్తగూడెం జూలై 1, (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సో లార్ విద్యుత్ వినియోగంపై దృష్టి సారించాలని ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ అన్నారు. శిక్షణలో భాగంగా కార్పొరేషన్ విధివిధానాలను, పరిధి వివరాలను అధికారుల నుంచి తెలుసుకొనేందుకు మంగళవారం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాల యాన్ని ఆయన సందర్శించారు.
ఇంజనీరింగ్ విభాగంలో రికార్డులను పరిశీలించిన ఆయన పలు అంశాలను కులంకషంగా అడి గి తెలుసుకున్నారు. వీధి దీపాలు మంచినీటి సరఫరా చేసే బోర్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని రోజులకోసారి ప్రజలకు తాగునీరు అందిస్తున్నారు, ఫిల్టర్ బెడ్ ఎక్కడ ఉంది, ఓవర్ హెడ్ ట్యాంకులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేస్తున్నారు, తాగునీటి పైపు లైన్ల వ్యవస్థ పనితీరు ఎలా ఉంది అని ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసు కున్నారు.