02-07-2025 12:39:50 AM
- హైదరాబాద్‌లో జోరు వర్షం
- లోతట్టు ప్రాంతాలు జలమయం.. ట్రాఫిక్ జామ్
- పలు జిల్లాల్లో ముసురు
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 1 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్‌లో బుధవా రం రాత్రి జోరు వాన కురిసింది. సాయం త్రం నుంచి రాత్రి వరకు కురిసిన భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయ మయ్యాయి. పగటిపూట మేఘావృతమైన వాతావరణం ఒక్కసారిగా చల్లబడినప్పటికీ, సాయంత్రం వేళ భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రహదారులపై మోకాలి లోతు నీరు నిలిచిపోవడంతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి.
కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. లో తట్టు ప్రాంతాలు, కాలనీల్లో వర్షపు నీటితో డ్రైనేజీలు పొంగిపొర్లి, దుర్వాసనతో ప్రజలు అవస్థలు పడ్డారు. చర్యల కోసం జీహెచ్‌ఎం సీ, హైడ్రా, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. నీటి నిల్వలను తొలగిస్తూ, డ్రైనేజీలను శుభ్రం చేసే పనులను ముమ్మ రం చేశాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, అమీర్‌పేట్, ఎస్‌ఆర్‌నగర్, పం జాగుట్ట, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, ప్యారడైజ్, చిలకలగూడ, బేగంపేట ప్రాంతాల్లో వర్షం కురిసింది. కాగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ముసురు కరిసింది.
4 రోజుల పాటు భారీ వర్షాలు
రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ర్టవ్యాప్తంగా పలుచోట్ల ఉరుములు, మెరుపు లు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యా ల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
గురువారం ఆసిఫా బాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జగితాల్య, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది.