12 June, 2026 | 2:32 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

వాసు.. మంగ.. బలమైన ప్రేమకథ!

16-04-2026 02:24 AM

దర్శకుడు అజయ్ భూపతి ఓ బలమైన ప్రేమథతో రూపొందిస్తున్న తాజాచిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. అశ్విని దత్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను చందమామ కథలు బ్యానర్‌పై పీ కిరణ్ నిర్మిస్తున్నారు. జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాతో రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు. మోహన్‌బాబు ఇందులో విలన్ పాత్రలో కనిపించనున్నారు.

టీమ్ తాజాగా ఈ చిత్రం టీజర్‌ను సూపర్ స్టార్ మహేశ్‌బాబు చేతుల మీదుగా లాంచ్ చేయించింది. తిరుపతి దేవాలయ పట్టణంలో సాగే ఈ కథ వాసుబాబు, మంగా అనే ఇద్దరు స్నేహితులు ప్రేమికులుగా మారి ఆనందంగా జీవించే ప్రయాణాన్ని చూపిస్తుంది.

ఒకానొక సందర్భంలో మంగాను వదిలి వెళ్లలేని వాసుబాబు, తన ప్రేమ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమవుతాడు. అజయ్ భూపతి ఈ చిత్రంలో యూత్‌ఫుల్ లవ్‌స్టోరీని యాక్షన్, భావోద్వేగా లతో మిళితం చేశారు. జయకృష్ణ, రాషా మధ్య కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్; డీవోపీ: జయకృష్ణ ఐఎస్‌సీ; ఎడిటర్: మాధవ్‌కుమార్ గుళ్ల పాటి; ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేశ్.