14-01-2026 06:05:10 PM
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్
మంథని,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన విబిజి, రామ్ జి పథకాన్ని రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ డిమాండ్ చేశారు. ఈ నెల 19 జరిగే నిరసన కార్యక్రమంలో కార్మిక కర్షకులు పాల్గొని విజయవంతం చేయాలని గణేష్ బుధవారం మంథని మండలం లక్కేపూర్ గ్రామంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గాంధీ పేరుతో ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని రద్దుచేసి విబిజి, రాంజీ పథకాన్ని తీసుకువచ్చిందని, ఈ పథకం అమలయితే గ్రామీణ ప్రాంతంలో పేదలు పని హక్కును కోల్పోతారు.
ఈ పథకానికి నిధులు తగ్గించి పనులను కాంట్రాక్టర్లకు అప్పజెప్పి కూలీలతో కాకుండా యంత్రాల ద్వారా పనిచేస్తారని అన్నారు. దీనివల్ల వ్యవసాయ కార్మికులకు పని దొరకని పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతంలో ఉపాధి లేకుండా చేస్తున్న ఈ పథకాన్ని ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని, జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ కూలీలు పాల్గొన్నారు.