ఆకట్టుకున్న వీరభద్రుని సుప్రభాత సేవ
ఆడియో, వీడియో ప్రసార మాధ్యమాల ద్వారా విడుదల రూపొందించిన ఆలయ అర్చకులు రాంబాబు
భీమదేవరపల్లి, జూలై 4 (విజయక్రాంతి): వీరభద్రుడు, భద్రకాళి అమ్మవార్లను స్తుతి స్తూ కొత్తగా తయారుచేసిన సుప్రభాత సేవ ఆడియో వీడియో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. హనుమకొండ జిల్లా భీమదే వరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలోని వీరభద్ర స్వామి ఆలయ ముఖ్య అర్చకులు మొగిలిపాలెం రాంబాబు వీరభద్రుడు భద్రకాళి అమ్మవార్లను ఆలయ విశిష్టత వివరి స్తూ రూపొందించిన స్వామివారి సుప్రభాత సేవ శనివారం ప్రసారం మాధ్యమాల ద్వా రా విడుదల చేశారు.
గతంలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సుప్రభాత సేవవలే ఉన్న కొత్తకొండ వీరభద్ర స్వామి సుప్రభాత సేవ విన్న భక్తులంతా భక్తి పారవశ్యంతో తన్మయ త్వం చెందారు .సుమారు 12 నిమిషాల 21 సెకండ్ల పాటు కొనసాగే ఈ వీడియోలో వీరభద్రుడు, భద్రకాళి అమ్మవార్లతో తో పాటు ఆలయం గురించి చక్కగా సుప్రభాత సేవలో వినిపిస్తూ గానం కొనసాగుతుంది. ఆలయ అర్చకులు రాంబాబు రూపొందించిన సుప్రభాత సేవపై ఉత్తర తెలంగాణ జిల్లాలోని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






