calender_icon.png 24 June, 2025 | 12:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేవెళ్ల జూనియర్ సివిల్ కోర్టుకు కొత్త జడ్జి బాధ్యతలు స్వీకరించిన విజయ్‌కుమార్

24-06-2025 12:31:41 AM

చేవెళ్ల, జూన్ 23: చేవెళ్ల జూనియర్ సివిల్ కోర్టుకు కొత్త జడ్జి వచ్చారు. అచ్చంపేట నుం చి బదిలీపై వచ్చిన విజయ్ కుమార్ ఉపాధ్యాయ్ సోమవారం బాధ్యతలు స్వీకరిం చారు. అంతకుముందు ఆయనకు చేవెళ్ల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి , వైస్ ప్రెసిడెంట్ నర్సింలు, స్పోరట్స్ సెక్రటరీ ప్రభాకర్ రెడ్డి, ఏజీపీ, లేడీ రీ ప్రెజెంటర్ గీత వనజాక్షి, ట్రెజరర్ రవీందర్ రెడ్డి, లైబ్రేరియన్ మల్లేష్, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ తలారి ప్రకాశం, శివరాజ్ గౌడ్, సీహెచ్ రవీందర్, ప్రదీప్ రెడ్డి.. స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. అనంతరం కోర్టు ప్రాంగణం అంతా చూపించి... అక్కడ ఉన్న సమస్యల గురించి వివరించారు. సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని జడ్జిహామీఇచ్చారు.