31 July, 2026 | 3:07 AM

వెల్దండ మండల సమావేశం రసాభాస

31-07-2026 02:09 AM

ఎమ్మెల్యే సమక్షంలోనే సర్పంచుల పతులు హంగామా

రాజకీయ వేదికగా అధికారిక సమావేశం

వెల్దండ, జూలై 30: ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చించాల్సిన మండల సమీక్షా సమావేశం రాజకీయాలకు వేదికగా మారింది. గురువారం వెల్దండ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ సర్పంచుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడం చర్చనీయంశంగా మారింది. సమావేశంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు కాకుండా సర్పంచుల భర్తలు, ఇతర నాయకులు పాల్గొనడాన్ని బీఆర్‌ఎస్ సర్పంచులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం మొదలైంది.

నిబంధనల ప్రకారం ఎన్నికైన సర్పంచులు మాత్రమే సమావేశంలో ఉండాలని అధికారులు స్ప ష్టం చేసినప్పటికీ, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి రాక అనంతరం సర్పంచ్ పతులు(భర్త ) లు మళ్లీ సమావేశంలోకి రావడంతో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. సీఐ రఘువీర్ రెడ్డి జోక్యంతో పరిస్థితి అదుపులోకి రాగా, అధికారిక సమావేశాలు రాజకీయ బలప్ర దర్శ నలకు వేదిక కాకూడదని ఎమ్మెల్యే సూచించారు. దీంతో గ్రామాల్లోని అసలు సమస్య లు దారిమల్లి రాజకీయ వేదికగా సమావేశం ముగియడం విశేషం.