12-12-2025 12:00:00 AM
నాగిరెడ్డిపేట్, డిసెంబర్ 11 (విజయ క్రాంతి): ఇరిగేషన్ ఎల్లారెడ్డి డిప్యూటీ ఇంజనీరింగ్ వెంకటేశ్వర్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అదనపు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి,లింగంపేట్, మండలాల ఇరిగేషన్ అధికారులు మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్చము అందజేసి మిఠాయి తినిపించి అభినందనలు తెలియజేశారు.
ఆయనతో చేసినటువంటి సేవలను విధులను సిబ్బంది ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుని కొనియాడారు. ఇలాగే ఇలాంటి మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ. శివనంది అక్షయ్, వర్క్ ఇన్స్పెక్టర్ యాదగిరి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.