3 July, 2026 | 11:31 PM

Breaking News

బెల్లంపల్లి ఐటీడీఏ నర్సరీకి పూర్వవైభవం   •   పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •  

మరోమారు గొంతు సవరించుకున్న వెంకీ

27-12-2024 02:42 AM

సంక్రాంతి సంబరాల్లో హరిదాసుల పాటకు పోటీనిచ్చేందుకు వెంకీ మామ మరోమారు గొంతు సవరించుకున్నాడు. గతంలో ‘గురు’ సినిమాలో విక్టరీ వెంకటేశ్ ‘జింగిడి జింగిడి’ అంటూ పాడిన పాట అప్పట్లో చార్ట్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మరోసారి సింగర్‌గా అలరించబోతున్నాడు వెంకటేశ్.

సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలోని స్పెషల్ ఫెస్టివల్ ట్రాక్‌కు తన వాయిస్‌ను అందిస్తున్నారాయన. దర్శకుడు తొలుత ఈ పాటను ప్రముఖ బాలీవుడ్ సింగర్‌తో పాడించాలనుకున్నారు. అయితే తానే పాడతానని వెంకటేశ్ కోరడం, డైరెక్టర్ అంగీకరించడంతో వెంకీ గాత్రాన్ని వినే భాగ్యం అభిమానులకు కలుగుతోంది. ఈ సినిమా జనవరి 14న విడుదల కానుంది.