17 April, 2026 | 2:50 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

వైభవంగా వేణుగోపాల స్వామి కల్యాణం

02-02-2026 12:44 AM

గరిడేపల్లి, ఫిబ్రవరి 1: మండలంలోని పొనుగోడు గ్రామంలో కొలువై ఉన్న చారిత్రాత్మక శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి వార్షిక కళ్యాణంను గ్రామస్థులు ఆదివారం వైభవంగా జరిపంచారు. ఈ సందర్భముగా ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభించి తోరణ అలంకరణ, శ్రీ ఆంజనేయ స్వామికి అభిషేకం, నవగ్రహ హోమం, సుదర్శన హోమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన  అనంతరం వేద పండితులు అలహరి నరసింహచార్యులు, రవి అయ్య గార్ల ఆధ్వర్యంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణం వేదమంత్రాల నడుమ కన్నుల పండుగలా నిర్వహించారు.

అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు స్వామి వారి కళ్యాణాన్ని కనులారా తిలకించారు. స్వామివారిని స్మరిస్తూ పాడిన భజన పాటలు భక్త లోకాన్ని  తరింపజేశాయి.దేవాదాయ ధర్మాదాయ శాఖ మేనేజర్ కొంకపాక మృత్యుంజయ శాస్త్రి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.స్వామి వారి కళ్యాణం అనంతరం అన్నప్రసాద పంపిణీ నిర్వహించారు. ఈ కళ్యాణ ఉత్సవంలో పొనుగోడు గ్రామ సర్పంచ్ కటకం వేణు, ఉప సర్పంచ్ జోగు అరవింద రెడ్డి, కటకం రమేష్, అలుగుబెల్లి  రవీందర్ రెడ్డి, ఎల్లావుల పిచ్చయ్య  కంది బండ చిన్నరామయ్య రామదాసు, శ్రీ వాణి స్కూల్ కొణతం సీతారాం రెడ్డి, కందిబండ నాగేశ్వరరావు, అలుగుబెల్లి దేవి రెడ్డి, బాల్తు సుధాకర్, జోగు లింగారెడ్డి, చందా మోహన్ రెడ్డి, నక్కమట్టయ్య, అనంతు వెంకన్న గౌడ్, రామకోటమ్మ, శ్రీదేవి, మాధవి తదితరులు పాల్గొన్నారు.