02-02-2026 12:46:19 AM
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల దిష్టిబొమ్మలు దగ్ధం
పలు మండలాల్లో బైక్ ర్యాలీలు
సూర్యాపేట, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): మాజీ ముఖ్యమంత్రి, బి ఆర్ ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ కు ఫోన్ టాపింగ్ కేసు నిమిత్తం సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడంపై బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా పట్టణాలు, మండల కేంద్రాలలో బైక్ ర్యాలీలు నిర్వహించగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను పలుచోట్ల దహనం చేశారు. ముఖ్యంగా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశాల మేరకు పేట నియోజకవర్గం వ్యాప్తంగా భారీ నిరసన ర్యాలీలు చేపట్టారు. సూర్యాపేట పట్టణంలో సుమారు 500 బైకులతో ర్యాలీ తీసి మాజీ ఎంపీ, బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగులు లింగయ్య యాదవ్, ట్రైకార్ మాజీ చైర్మన్, సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి రాంచందర్ నాయక్ లు మండిపడ్డారు.
గరిడేపల్లిలో హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కార్యక్రమంలో హుజూర్నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జులు కంచర్ల కృష్ణారెడ్డి,రేగట్టే మల్లికార్జున్ రెడ్డి,గరిడేపల్లి మండల పార్టీ అధ్యక్షులు గుబులోతు కృష్ణ నాయక్, గుత్తికొండ వెంకటరమణారెడ్డి, మోతెలో నూకల శ్రీనివాస్ రెడ్డి, మద్ది మధుసూదన్ రెడ్డి, బానోతు దేవల, పాలకవీడు మండలం మహంకాళి గూడెంలో నాయకులు రాపోలు నవీన్, పెరుమళ్ళ సతీష్ ల ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పిండ ప్రధానం చేశారు. మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మండల బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు కిష్టిపాటి అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో
చౌటుప్పల్ లో మున్సిపాలిటీ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. గిర్కటి నిరంజన్ గౌడ్,చింతల దామోదర్ రెడ్డి ఆలేరులో మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత పుట్ట మల్లేష్, వస్పరి శంకరయ్య, కందుల శంకర్ సంస్థాన్ నారాయణపూర్ లో మండల అధ్యక్షులు నర్రి నరసింహ తెలంగాణ బిక్షం,బుగ్గ రాములు గుండాల లో మండల అధ్యక్షుడు ఎండి ఖలీల్, మాజీ జెడ్పిటిసి మందడి రామకృష్ణారెడ్డి, ఆలకుంట్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లాలో
దేవరకొండలో బిఆర్‌ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్, మున్సిపల్ ఎన్నికల ఇంచార్జీ పాల్వాయి స్రవంతి, నేనావత్ కిషన్ నాయక్, కేతావత్ బిల్యా నాయక్, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు టివిఎన్ రెడ్డి, మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చిట్టి బాబు నాయక్, రాష్ట్ర యువజన నాయకులు తుమ్మల ఫణి కుమార్, ఎండి షోయబ్, చండూరులో పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.