08-01-2026 12:00:00 AM
నేరేడుచర్ల, జనవరి 7: వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మేడారం గ్రామంలో బుధవారం ఉచిత పశు వైద్య శిబిరాన్ని మార్కెట్ చైర్మెన్ బెల్లంకొండ విజయ లక్ష్మి వైస్ ఛైర్మన్ తాళ్ళ సురేష్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేడారం పరిసర ప్రాంత రైతులు పశుపోషకులు, పశువులకు చికిత్స చేయించుకొని పశు వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అనంతరం పశువులకు గర్బాశయ సమస్యలకు, నులిపురుగులకు చికిత్స చేసి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి సన్నీ, వెటర్నరీ డాక్టర్లు నరేశ్, బి.రవి,ఎన్. శ్రీకాంత్, వెంకన్న, నల్లమల్ల రాకేశ్, మేడారం గ్రామపంచాయతి సర్పంచ్ పారెపల్లి సత్యనారాయణ, ఉప సర్పంచి పెద్ది సైదులు, మేడారం గ్రామపంచాయతి వార్డ్ మెంబర్లు, పల్లె వెంకన్న, గోట్టెముక్కల రామకృష్ణ, కట్ట రామరావు, మామిడి వెంకటేశ్వర్లు, రాజీవ్, గోపాలమిత్ర సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.