calender_icon.png 11 January, 2026 | 12:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ వైద్యుడి అరెస్ట్

08-01-2026 12:00:00 AM

ఉప్పల్ జనవరి 7 (విజయ క్రాంతి) : వైద్య అర్హత లేకున్నా  వైద్యం చేస్తున్న ప్రజలను మోసగిస్తున్న నకిలీ వైద్యున్ని అరెస్ట్ చేసి కటకటాల కు పంపారు నాచారం పోలీసులు. నాచారం సబ్ ఇన్స్పెక్టర్ మైబల్లి తెలిపిన వివరాల ప్రకారం.. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ సెంట్ ఆన్స్ చర్చ్ సమీపంలో నాగ మాత క్లినిక్ పేరుతో అనిమేష్ రాయి సరైన వైద్య అర్హత లేకుండానే వైద్య సేవలు అందిస్తున్నారని సమా చారం మేరకు నాచారం పోలీసులు దాడు లు నిర్వహించారు. ఈ దాడుల్లో సంబంధిత వైద్య శాఖ అనుమతులు లేకుండా వైద్యం నిర్వహిస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు . కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు