15 May, 2026 | 2:52 AM

ప్రభుత్వ సలహాదారుగా వీహెచ్ బాధ్యతల స్వీకరణ

15-05-2026 12:06 AM

శుభాకాంక్షలు తెలిపిన పీసీసీ చీఫ్, మంత్రులు తదితరులు

హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి) : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుంతరావు ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే క్యాబినెట్ హోదాతో వీహెచ్‌కు ప్రభుత్వ సలహా దారుగా నియమించడంతో గురువారం సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. వీహెచ్‌ను మాజీ మంత్రి జానారెడ్డి, మంత్రు లు శ్రీధర్‌బాబు, వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వి. శంకరయ్య, దానం నాగేందర్, రాజ్ ఠాకూర్, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, మెట్టు సాయికుమార్, ముత్తినేని వీరయ్యతో కాంగ్రెస్ నేతలు రాజేష్‌కుమార్ అగర్వాల్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు కలిసి వీహెచ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 

బాధ్యతలు చేపట్టిన సరిత 

రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరే షన్ చైర్‌పర్సన్‌గా సరితాతిరుప తయ్య యా దవ్ గురువారం మాసబ్ ట్యాంక్‌లో ఉన్న సంబంధిత శాఖ కార్యాలయంలో బాధ్య తలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి, పార్టీ నేతలు ఆమెకి శుభా కాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి మాట్లాడుతూ పశు పోషణలో అవ గాహన ఉన్న సరితను కార్పొరేషన్ చైర్ పర్సన్‌గా నియమించిన సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. గొర్రెలు, మేకల పెంపకం వృత్తి చేసే వా రికి ఉపాధి కల్పించే లక్ష్యంతో ముందుకు పోతామని మంత్రి పేర్కొన్నారు.