15 May, 2026 | 2:53 AM

బీసీల సత్తాను కేంద్రానికి చూపుతాం

15-05-2026 12:07 AM
  1. పరేడ్ గ్రౌండ్‌లోనే ‘బీసీ మహా గర్జన’ నిర్వహిస్తాం
  2. బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ 

హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ప్రధాని సభ లో బీసీ కులగణన అంశాన్ని ప్రస్తావించకపోవడం తగదని, బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీ అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. హైదరాబాద్‌లోని సచివాలయం మీడియా పాయిం ట్ వద్ద గురువారం జాజుల మాట్లాడారు.

ప్రధానికి బీసీలు సంధించిన 10 ప్రశ్నలకు ఇప్పటివరకు బీజేపీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదని పేర్కొన్నారు. బీజేపీ నిర్వ హించిన పరేడ్ గ్రౌండులోనే త్వరలో బీసీ మహా గర్జన నిర్వహించి బీసీల సత్తాను కేంద్ర ప్రభుత్వానికి చూపిస్తామని తెలిపారు. 11 ఏళ్ల బీజేపీ పాలనలో బీసీలకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని విమర్శించారు.

మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మహిళలకు సబ్ కోటా కల్పించకుండా అన్యాయం చేశారన్నా రు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే బీసీ కులాల లెక్కలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, బీసీ నేతలు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, తాటికొండ విక్రమ్ గౌ డ్, ప్రొఫెసర్ బాగయ్య, కాటేపల్లి వీరస్వామి, జల్లెల నరసింహ తదితరులు పాల్గొన్నారు.