calender_icon.png 5 May, 2025 | 7:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ డిపో ఎదుట వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్ ధర్నా

05-05-2025 02:40:18 AM

నిబంధనలకు విరుద్ధంగా గోదావరిఖని ఆర్టీసీ బస్టాండ్ లో అన్యమత ప్రచారం చేసిన క్రైస్తవులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు 

గోదావరిఖని, ఏప్రిల్ 04(విజయక్రాంతి): గోదావరి ఖని బస్టాండ్, డిపో సమీపంలో గత నెల 30తేదీ నుండి ప్రతి రోజూ క్రైస్తవ మతానికి చెందిన వారు ప్రయాణికులను ఆసరాగా చేసుకుని క్రైస్తవ కరపత్రాలు పంచుతూ హిందు దేవి, దేవతలని దుర్భాషలాడుతూ హిందు ఆచార వ్యవహారాలనీ వ్యతిరేకంగా మాట్లాడుతూ ప్రయాణికులను మత మార్పిడులకు పాల్పతున్న చర్యాకి నిరసనగా ఆదివారం గోదావరిఖని బస్ డిపో ముందు విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ విభాగ కార్యదర్శి అయోధ్య రవీందర్ మాట్లాడుతూ గత నాలుగు ఐదు రోజులుగా గోదావరిఖని బస్టాండ్ ఏరియాలో క్రైస్తవ మత మార్పిడి కోసం మత ప్రచారం చేస్తున్న మత ప్రచారకులపై ఆర్టీసీ యాజమాన్యం కనీస చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

డిపో మేనేజర్ నాగభూషణం  మాట్లాడుతూ పోలీస్ అవుట్ పోస్టు నిరంతరం ఉండేలా ఏర్పాటు చేస్తూ గత నాలుగైదు రోజులుగా జరుగుతున్న చర్యలపై ఆర్టీసీ విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తామని, తప్పకుండా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకులకు హామీ ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నగర కార్యదర్శి మ్యాడగోని రవీందర్, బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ సంపత్ యాదవ్, అడిగొప్పుల రాజు, మునిగాల సంపత్, కొండపర్తి లింగన్న, పైతరి రాజు, జువెలరీ శ్రీధర్, కుమార్, దిగంబర్, పొన్నం అంజయ్య, మేడగోని అరవింద్, కొరివి వెంకటేష్,  రమేష్ యాదవ్, అనిరుద్ గిరికుమార్, గోటిక శ్రీనివాస్, లక్ష్మయ్య, మధ్యల శ్రీనివాస్, గొట్టే నవీన్, ప్రకాష్, వేణు తదితర కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.