05-05-2025 02:41:49 AM
కరీంనగర్ క్రైం, మే 4 (విజయ క్రాంతి): కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం జరిగిన నీట్ పరీక్ష బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని ఏడు పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చూడటానికి అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.