05-05-2025 02:39:12 AM
నిజామాబాద్, మే 4(విజయ క్రాంతి): ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల్లో రాష్ట్రస్థాయలో 596 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకులో నిలిచిన కాకతీయ ఒలంపియాడ్ విద్యార్థిని ఎస్. కృతి నీ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దంపాల్ సూర్యనారాయణ సన్మానిం చారు.
ఈ కార్యక్రమం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగింది ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా విద్యార్థిని రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు సాధించడం పాఠశాల తల్లిదండ్రులకు జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిందని కొనియాడారు భవిష్యత్తులో ఇంకా ఉన్నత లక్ష్యాలను సాధించే హిందువులు జిల్లాకు గర్వకారణంగా విద్యార్థులు నిలవాలని ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు.
తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు తక్కువ మార్కులు సాధించి ఫెయిల్ అయినప్పటికీని విద్యార్థులు మనోధైర్యం కోల్పోకుండా చదివి తిరిగి పరీక్ష రాసి ఉత్తీర్ణత పొందాలని అందుకు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సహకరించాలని ఆయన సూచించారు ధన్పాల్ సూర్యనారాయణ లక్ష్మీబాయి విట్టల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా విద్య అందిస్తున్న వారికి ఈ సంవత్సరం పదో తరగతి మొదటి శ్రేణిలో పాసైన విద్యార్థులు ఉండటం సంతోషంగా ఉందన్నారు పేద విద్యార్థుల చదువులకు ఎల్లప్పుడూ తాను అండగా ఉంటానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాకతీయ ఒలంపాడ్ స్కూల్ డైరెక్టర్ సిహెచ్ రామోజీరావు కాకతీయ విద్యాసంస్థల ప్రిన్సిపల్ రణదీప్ డాక్టర్ రాఘవేంద్ర చిత్రవారి తదితరులు పాల్గొన్నారు .