18 July, 2026 | 1:05 AM

నీట్ యూజీ ఫలితాల్లో ‘వైబ్రంట్’ హవా

18-07-2026 01:05 AM

అత్యుత్తమ ర్యాంకులు సాధించిన అకాడమి విద్యార్థులు

హనుమకొండ, జులై17 (విజయక్రాంతి): నీట్ యూజీ 2026 ఫలితాలలో వైబ్రంట్ అకాడమి విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని వైబ్రంట్ అకాడమి డైరెక్టర్ సీహెచ్ రాజేందర్‌రెడ్డి తెలిపారు. గ్రామీణ పేద విద్యార్థుల కోసం కోటా రాజస్థాన్ వైబ్రంట్ అకాడమిని వరంగల్‌లో స్థాపించామని తెలియజేస్తూ గురువారం విడుదల చేసిన నీట్ యూజీ 2026 ఫలితాలలో వైబ్రంట్ అకాడమి విద్యార్థులు అత్యధికంగా ర్యాంకులు సాధించారని, ఇలాంటి ర్యాంకులు మొదటి బ్యాచ్‌లోనే సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు.

వైబ్రంట్ అకాడమి మొదటి నుంచి నీట్, జేఈఈలలో అత్యుత్తమైనటువంటి శిక్షణను వరంగల్‌లో అందించడం జ రు గుతుందని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులను సై తం చక్కటి అకాడిమిక్ ప్రోగ్రామింగ్ ప్రణాళికల ద్వారా అద్భుతమైన ఆణిముత్యాలుగా తయారు చేసి జాతీయ స్థాయిలోనే ఉన్నతమైన ర్యాంకులు సాధించామన్నారు. జాతీయ స్థాయిలో ఉన్నతమైన ర్యాంకు ఏఐఆర్ 143 బి.వినాయక్ హాల్ టికెట్ నెం. 42051 02271, 12 మంది అత్యుత్తమైన ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ టి.శేషుకుమార్, అడ్మినిస్ట్రేషన్ హెడ్ జి.రఘుపతి, కోఆర్డినేటర్ రామ్ గుమ్మడి, అధ్యాపక బృందం, బోధనేతర సిబ్బంది  పాల్గొన్నారు.