18 July, 2026 | 1:00 AM

యోనెక్స్ సన్‌రైజ్ బ్యాడ్మింటన్ పోటీలు

18-07-2026 01:00 AM

మణికొండ వేదికగా ఘనంగా ప్రారంభం

నాలుగు రోజుల పాటు నిర్వహణ

హైదరాబాద్, జూలై 17 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ (బీఏటీ), తెలంగాణ స్పోర్ట్స్ అథా రిటీ సహకారంతో నిర్వహిస్తున్న యోనెక్స్ సన్‌రైజ్ 12వ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ (అండర్-15) బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ 2026 శుక్రవారం హైదరాబాద్‌లోని మ్యాచ్ పాయింట్ ప్రైడ్, మణికొండ వేదికగా ఘనంగా ప్రారంభమైంది.

తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా, జి. వెంకట్ రావు ముఖ్య అతిథులుగా హాజరై టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతిభావంతులైన యువ షట్లర్లకు ఇటువంటి రాష్ట్రస్థాయి పోటీలు తమ ప్రతిభను చాటుకునేందుకు అద్భుతమైన వేదికగా నిలుస్తాయన్నారు. జూలై 16 నుంచి 19 వరకు జరిగే ఈ ఛాంపియన్‌షిప్‌లో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన అండర్-15 బాలబాలికలు సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో హోరాహోరీగా పోటీపడుతున్నారు.   

ఈ పోటీలు భవిష్యత్ జాతీయ, అంతర్జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారులను తీర్చిదిద్దే వేదికగా నిలుస్తాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సలహాదారు కొసరాజు లక్ష్మణ్, కోశాధికారి కానూరి వంశీధర్, సంయుక్త కార్యదర్శులు యూవీఎన్ బాబు, సాంకేతిక నిపుణుల కమి టీ కన్వీనర్, రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి కరెడ్ల శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షలు సామా ప్రభాకర్ రెడ్డీ సంయుక్త కార్యదర్శులు ఆర్ శ్రీనివాస్ జయంత్, శ్రీకాంత్ రెడ్డి, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ మీడియా కోఆర్డినేటర్ ఏవీ రమణారెడ్డి, కామారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి సందీప్, మ్యా చ్ పాయింట్ ప్రైడ్ అధినేత ముప్పాళ్ల వేణు పాల్గొన్నారు. పోటీ లను విజయవంతంగా నిర్వహించేందు కు రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.