18 July, 2026 | 1:02 AM

వంద శాతం సక్సెస్ రేట్‌తో ‘సర్వజ్ఞ’

18-07-2026 01:02 AM

నీట్ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన విద్యార్థులు

హైదరాబాద్, జులై 17 (విజయక్రాంతి): నీట్ ఫలితాలలో సర్వజ్ఞ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబర్చి అత్యుత్తమ ఆలిండియా ర్యాంకులు సాధించారు. నీట్ 2026 ఫలితాలలో సర్వజ్ఞ విద్యార్థులు ఎం.లక్ష్మీదేవి(ఆల్ ఇండియా ర్యాంక్ 8355), బి.మెర్సి (ఆల్ ఇండియా ర్యాంక్ 8757), కె.సింధు(ఆల్ ఇండియా ర్యాంక్ 9833), ఎ.తన్విత్(ఆల్ ఇండియా ర్యాంక్14118), కె.మైధిలి(ఆల్ ఇండియా ర్యాంక్ 37508) సత్తా చాటారు. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే కేవలం అతికొద్ది మంది విద్యార్థు లతో నిర్వహించిన నీట్ లాంగ్ టర్మ్ శిక్షణలో ఈ అత్యుత్తమ ర్యాంకులు సాధించడ మేకాక 100 శాతం విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు సాధించడం గర్వకారణంగా వుం దని సర్వజ్ఞ విద్యా సంస్థలు చైర్మన్ ఆర్‌వీ నాగేంద్రకుమార్ తెలిపారు.