14-06-2025 07:00:15 PM
కరీంనగర్ (విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయ వార్షిక, క్రీడా దినోత్సవ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు క్రీడలు, సాంస్కృతిక పోటీల నిర్వహనలో భాగంగా శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్(Satavahana University Vice Chancellor Umesh Kumar) క్రీడా మైదానాన్ని సందర్శించి క్రికెట్ ఆటను ప్రారంభిస్తూ మాట్లాడుతూ... విశ్వవిద్యాలయ విద్యార్థుల కొరకు క్రీడా ప్రాంగణాన్ని కే లో ఇండియాలో భాగంగా నిర్మిస్తామని, ఏ క్రీడనైనా లోటుపాట్లు లేకుండా నిర్వహిస్తామని భవిష్యత్తులో తాను ఇంకా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తానని, ఇప్పుడు నిర్వహిస్తున్న క్రీడాపోటీలు, సాంస్కృతి కార్యక్రమంలో ప్రతి విద్యార్థిని విద్యార్థి చురుగ్గా పాల్గొని తమ నైపుణ్యాలను ప్రదర్శించాలని, చదువుతో పాటు ఆటపాటలలో కూడా ముందుండాలని ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని, క్రీడా స్ఫూర్తితో క్రీడలు ఆడాలని కోరారు.
ఇండోర్ స్పోర్ట్స్ లో భాగంగా మహిళలకు క్యారమ్స్, చెస్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ డైరెక్టర్ డా. నజీముద్దీన్ మునవర్, వ్యాయామాధికారి విజయకుమార్, క్రీడా సమన్వయ అధికారి డా.మనోజ్ కుమార్, బోధనేతర సిబ్బంది శ్రీనివాస్, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.