calender_icon.png 10 May, 2025 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజమైన సైనికులను చూసి బాధితులు గజగజ

24-04-2025 02:05:07 AM

పహల్గాంలో ఇండియన్ ఆర్మీ యూనిఫాంలో వచ్చి ముష్కరులు దాడి చేసిన నేపథ్యంలో బాధితులు నిజమైన సైనికులను చూసి కూడా గజగజ వణికిపో ంయారు. సైనికులు పర్యాటకులకు రక్షణ కల్పించేందుకు వారి వద్దకు వెళ్తుండగా.. ఓ మహిళ వారిని చూసి ఉగ్రవాదులు అనుకుని భయభ్రాంతులకు గురైంది.

పక్కనే భర్త మృతదేహం ఉండగా, ఆ పక్కనే కుమారుడు.. ‘నాన్న లే.. నాన్న లే..’ అని గుక్కపట్టి ఏడుస్తున్నాడు. సైనికులను చూసి ఆ మహిళ ఉగ్రవాదులని భావించింది. వెంటనే వారికి చేతులు జోడించి ‘దయచేసి నా బిడ్డను ఏమీ చేయకండి’ అంటూ బోరును విలపిస్తూ వేడుకున్నది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. సదరు మహిళ లాగానే ఇంకా ఎంతో మంది బాధితులను తమ పిల్లలను అంటిపెట్టుకుని ఉన్నారు. సైనికులు వారిని సముదాయించారు. ‘మేం మీకు రక్షణ కల్పించేందుకే వచ్చాం. మేం భారత సైనికులం. దయచేసి మమ్మల్ని చూసి భయపడకండి’ అని భరోసా కల్పించారు.