calender_icon.png 9 May, 2025 | 10:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింధూ జలాల ఒప్పందం నిలిపివేత

24-04-2025 02:01:29 AM

పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా సీసీఎస్ 5 కీలక నిర్ణయాలు

  1. అటారీ-వాఘా సరిహద్దు మూసివేత
  2. సార్క్ స్పెషల్ వీసా పథకానికి పుల్‌స్టాప్
  3. పాక్ హైకమిషన్ సిబ్బంది దేశం వీడాలని అల్టిమేటం
  4. దౌత్య కార్యాలయాల్లో సిబ్బంది కుదింపు
  5. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన భేటీ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రదాడిని భారత ప్రభుత్వం అత్యంత తీవ్రంగా భావించింది. ఢిల్లీలోని లోక్‌కల్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధాని నివాసంలో బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) సమావేశం అయింది. ఈ భేటీలో కమిటీ ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్నది.

పాకిస్థాన్‌తో 1960లో భారత్ కుదుర్చుకున్న సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్థాన్, భారత్ మధ్య ప్రజారవాణాకు ఉపయోగపడే వాఘా సరిహద్దును మూసి వేయాలని నిర్ణయించింది. తక్షణమే ఇది అమలులోకి వస్తుందని తెలిపింది. పాకిస్థాన్ పౌరులను ఎట్టిపరిస్థితుల్లోనూ భారత్‌లో ప్రవేశించనీయకూడ దని, వారి ప్రవేశాన్ని రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నది.

అలాగే పాక్‌తో దౌత్య సంబంధాలన్నింటినీ రద్దు చేసుకుంటున్నట్లు తెలిపింది. రాయబార కార్యాల యాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని 55 నుంచి 30కి కుదిస్తున్నామని తెలిపింది. పాక్ హైకమిషన్ సిబ్బంది 48 గంటల్లో  భారత్‌ను విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలిచ్చింది. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌లోని త్రివిధ దళాల అధికారులను ఉప సంహరిస్తున్నామని తెలిపింది.

పాక్ పర్యాటకులు, ప్రత్యేకంగా వీసా పొంది న వారు సైతం 48 గంటల్లో భారత్ వీడి వెళ్లిపోవాలని ఆదేశించింది. కాగా, గురువారం ఢిల్లీలో అఖిలపక్ష భేటీ నిర్వహించనున్నట్లు సీసీఎస్ ప్రకటించింది. ఈ భేటీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. 

క్యాబినెట్ కమిటీ నిర్ణయాలివే.. 

1. సింధూ నది జలాల ఒప్పందం నిలిపివేత

1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్థాన్ మధ్య సింధూ న ది జలాల ఒప్పందం జరిగింది. దీని ప్రకారం రెండు దేశాలు సింధూ నదితో పాటు ఉప నదులైన చీనాబ్, జీలం జలాలను రెండు దేశాలు పంచుకుంటున్నాయి. సింధూ నది భారత్‌లో 39 బిలియన్ క్యూబిక్ మీటర్ల మేర ప్రవహిస్తోంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఆ ఒప్పందాన్ని నిలిపివేసింది. భారత్ 1965, 1971, 1999లో పాక్‌తో జరిగిన యుద్ధాల సమయాల్లోనూ సింధూ నది ఒప్పందాన్ని నిలిపివేసింది. 

2.అటారీ సరిహద్దు మూసివేత

భారత్, పాకిస్థాన్ మధ్య అటారీ-వాఘా సరిహద్దును మూసేశారు. ఈ మార్గం భారత్-పాక్ మధ్య అటు ప్రజారవాణాకు, ఇటు వాణిజ్యానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండేది. ఈ నిర్ణయం వెంటనే అమ ల్లోకి వస్తుంది.  

౩. సార్క్ వీసా మినహాయింపు నిలిపివేత

పాక్ పౌరులు సార్క్ వీసా మినహాయిం పు పథకం కింద భారత్‌లోకి ప్రవేశించకుం డా కమిటీ నిషేధం విధింయింది. గతంలో ఇచ్చిన వీసాలను కూడా రద్దు చేసింది. వీసాల కింద భారత్‌లో ఉన్న పాక్ పౌరులు 48 గంటల్లో దేశాన్ని విడిచి వెళ్లాలని ఆదేశించింది. సరైన ధ్రువపత్రాలతో భారత్‌కు వచ్చిన వారు మే 1లోపు తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించారు. 

4. పాక్ హైకమిషన్ సలహాదారులు భారత్‌ను వీడాలి 

న్యూఢిల్లీలోని పాక్ హైకమిషన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న సైనిక, వైమానిక, నౌకాదళ సలహాదారులు వారం రోజుల్లో భారత్ విడిచి వెళ్లాలని కమిటీ అల్టిమేటం జారీ చేసింది. వారిని పర్సన్ నాన్ గ్రాటా (అవాంఛనీయ వ్యక్తులు)గా ప్రకటించింది. అంతే కాకుండా పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లోని భారత త్రివిధ దళాల సలహాదారులను సైతం ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది.

5. రాయబార కార్యాలయాల సిబ్బంది కుదింపు 

భారత్‌లోని పాక్ రాయబార కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది సంఖ్యను 55 నుంచి 30కి కుదించాలని కమిటీ నిర్ణయం తీసుకుంది.