స్టేషన్ కు వచ్చే బాధితులకు అండగా ఉండాలి
- సత్వర న్యాయం జరుగుతుందనే నమ్మకం, భరోసా కల్పించాలి
- మంచిర్యాల డీసీపీ భాస్కర్
- దండేపల్లి పీఎస్ ను ఆకస్మికంగా సందర్శించిన డీసీపీ
దండేపల్లి (విజయక్రాంతి) : న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు పోలీసులు అండగా ఉండాలని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్(DCP Eggadi Bhaskar) పేర్కొన్నారు. శుక్ర వారం సాయంత్రం డీసీపీ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిటిషన్ లను, రికార్డ్ లను తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరు, నమోదు చేయబడిన కేసులలో ప్లాన్ ఆఫ్ యాక్షన్, ప్రజలతో, ఫిర్యాదుదారులతో ఎలా ప్రవర్తిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిధి, బౌగోలిక పరిస్థితులు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయనే తదితర అంశాలను ఎస్ఐ ని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు, వారు చేస్తున్న విధులు, పని తీరు, వారికీ ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల పిర్యాదుల విషయంలో వెంటనే స్పందించి విచారణ చేపట్టి న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. పల్లె నిద్ర కార్యక్రమాలు నిర్వహించి ప్రజల సమస్యలు, పిర్యాదులు తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని, గంజాయి,మత్తు పదార్థాల, పిడియస్ రైస్, గుడుంబా సరఫరా, విక్రయం, అక్రమ రవాణా, సేవించడం వంటి వాటిపై, అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. డీసీపీ వెంట మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, దండేపల్లి ఎస్ఐ తైసినోద్దీన్ ఉన్నారు.






