08-08-2025 11:16:29 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) దోమకొండ మండల కేంద్రంలోని శ్రీ పద్మశాలి మార్కండేయ మందిరంలో ప్రతి ఏటా వైభవంగా జరిగే నూలు పున్నమి మహోత్సవ కార్యక్రమాలు ఈసారి సైతం ఘనంగా జరుపుటకు ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం జరిగే నూలు పున్నమి మహోత్సవం బద్రావతి భవనారుశీల కళ్యాణం మహోత్సవం కార్యక్రమాల కోసం ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలు పువ్వులతో అలంకరించారు. శనివారం ఉదయం ఏడు గంటలకు భక్తులందరూ కుంభాభిషేకం కోసం భజనలతో కుడి చెరువుకు వెళ్లి భక్తి పాటలతో బిందెలతో నీటిని తీసుకొచ్చి శివపార్వతులకు కుంబాభిషేకం నిర్వహిస్తారు.
అనంతరం 8 గంటలకు గణపతి పూజ అఖండ దీపారాధన 9 గంటలకు ధ్వజారోహణం అనంతరం భవన ఋషి భద్రవతీల కళ్యాణోత్సవం యజ్ఞం నిర్వహించడం జరుగుతుంది. యజ్ఞం అనంతరం భక్తులకు జంజాల పంపిణీ పాండిలవారీగా నిర్వహిస్తారు. గాయత్రి మంత్రం ఉపదేశించి జంధ్యాలను మార్చుకుంటారు. అనంతరం సాయంత్రం అలంకరించిన రథంపై ఉత్సవ విగ్రహాలను ఉంచి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా స్వామి వారిని ఊరేగిస్తారు. ఈ కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ అధ్యక్షులు మేక నాగరాజ్ ,బొమ్మరి గంగాధర్ లు భక్తులను కోరారు.