calender_icon.png 9 August, 2025 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇళ్ల అసంపూర్తి పనులు త్వరగా పూర్తి చేయాలి

08-08-2025 11:06:07 PM

అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలి...

ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి..

జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్..

గద్వాల (విజయక్రాంతి): డబల్ బెడ్ రూమ్ ఇళ్ల అసంపూర్తి పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్(District Collector B.M. Santosh) సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం దౌదర్‌పల్లి సమీపంలో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇండ్లను గద్వాల్ శాసన సభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి(MLA Bandla Krishna Mohan Reddy)తో కలిసి జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో సందర్శించి, ఇళ్ల నిర్మాణపు పనులను పరిశీలించి, పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మౌలిక వసతులు పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.

డబుల్ బెడ్ రూమ్ గృహాలలో విద్యుత్ కనెక్షన్లు, డ్రైనేజీ, త్రాగు నీటి వంటి అవసరమైన మౌలిక వసతుల పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. డబుల్ బెడ్ రూమ్ గృహాల పరిసరాలలో పారిశుధ్య పనులను చేపట్టి ఆకర్షనీయంగా తీర్చిదిద్దాలని మునిసిపల్ కమిషనర్‌కు ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న తాగునీటి సరఫరా,విద్యుత్ కనెక్షన్ల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. మిగిలి ఉన్న డ్రైనేజీ పనులను పూర్తిచేసి గృహాలను త్వరలో వాడుకలోకి తేవాలని ఆదేశించారు.

అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలి... ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి 

ప్రజల సౌకర్యం కోసం డబుల్ బెడ్ రూమ్ గృహాలలో విద్యుత్, డ్రైనేజీ, త్రాగునీరు,పారిశుధ్యానికి సంబంధించిన అన్ని పనులను  పూర్తి చేయాలని గద్వాల్ శాసన సభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. రెండు పడకల గదులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేలా సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ,నర్సింగ రావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస రావు,విద్యుత్ శాఖ ఎస్.ఈ శ్రీనివాస్ రెడ్డి,మిషన్ భగీరథ ఇంట్రా ఎస్.ఈ. వెంకట్ రమణ, పంచాయతీ రాజ్ డిఈ లక్ష్మన్న, మున్సిపల్ కమిషనర్ దశరథ్, ఇరిగేషన్ ఈఈ శ్రీధర్ రెడ్డి,తదితర అధికారులు పాల్గొన్నారు.