6 April, 2026 | 2:46 AM

బాబు జగ్గీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి

06-04-2026 12:00 AM

బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం 

నివాళులర్పించిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి 

జడ్చర్ల,ఏప్రిల్ 5 :భారత దేశ మాజీ ఉప ప్రధాని, దళితుల సంక్షేమానికి విశేష సేవలు అందించిన మహానేత బాబు జగ్గీవన్ రామ్  జయంతి సందర్భంగా ఆదివారం జడ్చర్ల ఎంపీడీవో కార్యాల యంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించా రు. ఈ కార్యక్రమానికి జడ్చర్ల శాసనసభ్యులు  జనంపల్లి అనిరుధ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బాబు జగ్గీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాబు జగ్గీవన్ రామ్  సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం చేసిన సేవలు అపారమని కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో నడుచుకుంటూ సమాజంలో సమానత్వం నెలకొల్పడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.