29 June, 2026 | 9:12 PM

కిషన్‌రెడ్డిని కించపరిచేలా సోషల్ మీడియాలో వీడియో

18-10-2024 12:59 AM

చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు

హైదరాబాద్,అక్టోబర్17(విజయ క్రాంతి): కేంద్రమంత్రి, తెలంగాణ బీజే పీ అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డిని కించపరిచేలా ఆయనపై సోషల్ మీడియా లో ఒక వీడియోను సర్క్యూలేట్ చేస్తున్నారని, నిందితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకునాలని బీజేపీ నేతలు గురువారం డీజీపీకి వినతిపత్రం సమర్పించారు.

ఎంతో కష్టపడి రాజకీ యంగా ఉన్నత స్థానానికి చేరుకున్న కిషన్ రెడ్డిపై తప్పుడు వీడియో ద్వారా ఆయన మర్యాదకు భంగం కలిగించేలా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు కోరారు. వెంటనే ఆ వీడియోను తొలగించాలని డిమాండ్ చేశారు.