29 April, 2026 | 6:10 PM

సాగునీటి సమస్య పరిష్కారం కోసం తపించిన విద్యాసాగర్ రావు

29-04-2026 04:41 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాగునీటి రంగ నిపుణులు, రాష్ట్ర సాధనలో తమ వంతుబాధ్యతను నిర్వర్తించిన మనప్రాంత వాసి విద్యాసాగర్ రావు  అని బిఆర్ఎస్ మాజీ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు. రాష్ట్రంలో ఉన్న జల వనరులు ఏ విధంగా ఈ ప్రాంత రైతాంగానికి ఉపయోగం చేయవచో  కెసిఆర తో కలిసి చర్చించిన వ్యక్తి విద్యాసాగర్ రావు  అని అన్నారు.

నీటి వనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ గా పదవీ విరమణ పొందినారని, వారి సేవలు మన ప్రాంత రైతాంగానికి ఉపయోగపడ్డాయన్నారు. వారు మన ప్రాంతం జాజిరెడ్డి గూడెంలో జన్మించడం మనప్రాంత ప్రజలు అదృష్టం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోపగాని రమేష్, ఉప్పుల నాగమల్లు, నల్లబెల్లి వెంకటేష్ పాల్గొన్నారు.