చిన్నారుల పౌష్టికాహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి
అచ్చంపేట: చిన్నారులకు సమతులతో కూడిన పౌష్టికాహారం అందించాలని ఐసిడిఎస్ అచ్చంపేట ప్రాజెక్ట్ సిడిపిఓ లక్ష్మి సూచించారు. 99 రోజుల ప్రజా పాలన ప్రణాళికలో భాగంగా బుధవారం అచ్చంపేటలో నిర్వహించిన సమావేశంలో సిడిపిఓ లక్మి, ఎక్సైజ్ సీఐ కృష్ణయ్య వివిధ అంశాల గురించి అవగాహన కల్పించారు. చిన్నారులపై ప్రభావం చూపించే వాటి విషయంలో దూరంగా ఉంచాలని సూచించారు.
గ్రాడ్యుయేషన్ డే, పిల్లల శారీరక మానసిక ఎదుగుదల, ఆరోగ్య పరీక్షల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ కృష్ణయ్య మాట్లాడుతూ గంజాయి.. సైబర్ క్రైమ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లలు గంజాయికి బానిసలు కావద్దని వివరించారు. కార్యక్రమంలో ఏసిటిపిఓ కమల, ఎక్సైజ్ ఎస్సై సతీష్ కుమార్, సూపర్వైజర్, అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.






