13-11-2025 12:06:52 AM
-దుకాణాలు కనిపించడం లేదా?
-ఇంతకాలం మౌనంపై అనుమానాలు..?
-విజిలెన్స్ వింగ్ పనితీరుపై అసంతృప్తి
-అధికారానికి దాసోహమా?
-సింగరేణిలో అక్రమాలకు అడ్డుకట్టేది..?
బెల్లంపల్లి అర్బన్, నవంబర్ 12: సింగరేణిలో అవినీతి, అక్రమాలను అరికట్టే ప్రధాన లక్ష్యంతో నెలకొల్పన విజిలెన్స్ వింగ్ పనితీరుపై అసంతృప్తులు వ్యక్తం అవుతున్నాయి. సింగరేణి సంస్థ మనుగడకు రాచపుండులా తయారైన అవినీతిని నిర్మూలించి, సింగరేణి ప్రక్షాళనలో విజిలెన్స్ అధికారుల పురోగతి శూన్యమేనన్న విమర్శలు ఉన్నాయి. సింగరేణిలోఎన్నడూ లేని విధంగా అవినీతి, ఆక్రమ ణలు రాజ్యమేలుతున్నాయి. ప్రతీ రంగంలో అవినీతి కోరలు జడలు విప్పాయీ. సింగరేణిలో అవినీతి కార్యకలాపాలు ‘మూడు పూలు ఆరు కాయలుగా‘ వర్ధిల్లుతున్నది. ఈ విషయం విజిలెన్స్ అధికారులకు కూడా తెలుసు. అవినీతినీ గుట్టురట్టు చేయడంలో వారిలో పనితనం ఇట్టే తెలుపుతున్నది.
సాక్ష్యాలకు అందకుండా సింగరేణిలో అవినీతి పెట్రేగింది. అందుకు తగిన సాక్ష్యాలతో అవినీతి భరతం పట్టడంలో కాలయాపనతోనే అధికారుల పుణ్య కాలమం తా గడిచిపోతున్నది. అన్నీ తేలికగా దరిచేరవనే వాస్తవాన్ని విజిలెన్స్ అధికారులు ఇకనైనా గుర్తించాలి. అంతేకానీ ప్రతీ అవినీతి, ఇతర అధికారుల తప్పిదాలకు సాక్ష్యాలు చెప్పడానికీ ఎవరూ ముందుకూ రావడం లేదని అవినీతి అరికట్టడంలో కాలయాపన చేస్తున్నారు. సింగరేణిలో అవినీతి, అక్రమాలను అరికట్టే విధి ధర్మానికి అన్యాయం చేస్తే విజిలెన్స్ ఉనికికే ప్రమాదం చోటుచేసుకుంటది. ఈ విషయాన్ని విస్మరిస్తే విజిలెన్స్ వింగ్ సింగరేణిలో అవినీతికి నిత్యం ప్రాణం పోసినట్టే అయితది.
ఉత్తపుణ్యానికి డొనేట్..
సింగరేణి చరిత్రలో బెల్లంపల్లి కేంద్రంగా పట్టణ నడిబొడ్డున సింగరేణి దుకాణాలు ఎవ రీ చేతుల్లో ఉన్నాయో విజిలెన్స్ వింగ్‌కు తెలియదా? ఇది కూడా ఎవరో వారికీ ఫిర్యాదు చేయాలా? లేదా తెలిసినా వారూ ఏమి చేసిన ట్టు. అందరిలాగే విజిలెన్స్ అధికారులు కూడా చోద్యం చూశారనేదే ఇక్కడ స్పష్టమౌతున్నది. మూడు దశాబ్దాల క్రితం నుంచి 500 దుకాణాలు వ్యాపారులకు దారాదత్తం అయ్యాయి. అక్రమంగా వాటిని వ్యాపారానికి వినియోగిస్తున్నారు. వారికి అప్పగించిన అధికారులు ఎవరినే విషయం విజిలెన్స్‌కు తెలియకుండా ఉంటుందా? అలా అనీ వారు చెప్పగలరా? అంటే విజిలెన్స్ కూడా ఏండ్ల తరబడి వ్యాపారుల చేతుల్లో ఉన్న సింగరేణి దుకాణాలను సంగతిని పట్టించుకోకుండా సినిమా చూసిన ట్టు చూస్తూ ఉండిపోవటం ఎంత వరకు సమంజసం అనే ప్రశ్న స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి.
ఒక్క రోజైనా ఈ దుకాణాల వ్యవ హారాన్ని తమ కోణంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళే పని ఎందుకూ చేయలేద నే దానిపైన అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి వారి నుంచి సరైనా సమా ధానం ఉంటుందా? అసలు సమాధానమే లే దు. ఇవ్వలేరు. ఇది వారి పనితీరు లోప భూ యిష్టతను ఎత్తి చూపుతున్నది. తమ ఆస్తిలాగా అధికారులు ఇష్టా రాజ్యాంగా సింగరేణి దుకా ణ సంపదను ఉత్తపుణ్యానికి డొనేట్ చేశారు. అధికారులు వారిపని వారూ చేస్తే విజిలెన్స్ అధికారులు తక్కువేమీ కాదన్నట్టుగా చూసీచూడనట్టు వ్యవహరించడంలో తమకు మిం చిన నిజాయితీ పరులు లేరనీ ఈ విషయంలో నిరూపించుకున్నారు.
విజిలెన్స్ మౌనంగా ఉంటే..
సింగరేణి దుకాణాల భారీ కుంభకోణంలో విజిలెన్స్ ఎందుకూ మౌనంగా ఉందనే విష యం చర్చనీయాశంగా మారింది. దుకాణాల వ్యవహారంలో ఉన్నతాదికారుల ప్రమేయంతోనే విజిలెన్స్ అధికారులు ఉదాసీనంగా ఉన్నారనేదీ స్పష్టం అవుతున్నది. విజిలెన్స్ లో కూడా వివక్షత, పక్షపాతం, లేదా అధికారులను ఎదిరించే సత్తాలేకపోవడమైనా ఉండాలి. ఈ పరిస్థితి ఉంటదని ఎవరూ అంత తేలికగా నమ్మరు.
ప్రధానంగా సింగరేణిలో అధికారుల తప్పుల విషయంలో కాస్తా పట్టింపులేనితనమే వారిలో ఉంటదన్న మరోవాదన కూడా ఇక్కడ లేకపోలేదు. సింగరేణిలో అవినీతి, అక్రమాల విచ్చలవిడితనాన్ని కట్టడి చేసి కంపెనీ లక్ష్యానికి విఘాతం కలిగించే వాటిపై చర్యల దిశగా విజిలెన్స్ పనితీరు ఉండాలీ. అలా కాకుండా దారితప్పుతోన్న వ్యవస్థలను గాడిలో పెట్టడానికి బదులు విజిలెన్స్ అధికారులు ఇలా లక్ష్యం దారినీ విస్మరించడం తగదనీ పలువురు హితవు పలుకుతున్నారు.
విజిలెన్స్ వింగ్‌ను ప్రక్షాళన చేయాల్సిందేనా..?
సింగరేణిలో విజిలెన్స్ వ్యవస్థ ఎంత కీలకమైందో.. తమపై ఉన్న గురుతర బాధ్యతలను ఇప్పటికైనా అధికారులు గుర్తించాలి. సింగరేణి కార్పొరేట్ అధికారులు కాలానికి అనుగుణంగా విజిలెన్స్ ను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించాలి. అలాగే ప్రస్త్తుతం ఉన్న విజిలెన్స్ వింగ్‌ను సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరాన్ని వారి తాజా పనితీరే స్పష్టం చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఉద్యోగ నిబద్ధత, నిమగ్నత, నిజాయితీ, తెగింపు ఉన్న వారిని విజిలెన్స్ విభాగములో బాగస్వామ్యం చేయడం తప్పని సరి.
ఈ దిశగా సింగరేణి ఉన్నతాధికారు లు పునరంకితం కావాలి. అవినీతి, అశ్రద్ధలేమి సింగరేణి లక్ష్యంగా ఇప్పటికైనా ముందడుగు పడాలి. ఇలా అయితేనే సింగరే ణి విజిలెన్స్‌కు పట్టిన నిర్లక్ష్యపుపీడ విరగడవుతుంది. ఇదే క్రమంలో సింగరే ణి ఉన్నతాధికారులు తక్షణమే బెల్లంపల్లిలో సింగరేణి దుకాణాల గల్లంతుపై విచారణకు పురమాయించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.