అందులో నిజం లేదు!

02-05-2024 12:05:00 AM

‘గుంటూరు కారం’ సినిమా ముందు వరకు కూడా స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను ఎంజాయ్ చేసిన కథానాయిక శ్రీలీల సినిమాల స్పీడు కాస్త తగ్గించింది. వరుస ఫెయిల్యూర్స్ రావడంతో సినిమాల ఎంపిక విషయంలో కాస్త సెలెక్టివ్‌గా వుండాలని ఆమె భావిస్తున్నారట. అయితే ఆమె కొత్త సినిమాలపై వార్తలు ఆగడం లేదు. తాజాగా ఆమె ఒక పెద్ద సినిమా ఆఫర్‌ని తిరస్కరించిందనే ప్రచారం జరిగింది. అది కూడా తమిళంలో స్టార్ హీరోగా కొనసాగుతున్న విజయ్ సినిమాలో ప్రత్యేక పాటను చేయమని అడిగితే నో చెప్పిందనే వార్త బయటికి వచ్చింది. దాంతో విజయ్ అభిమానులు ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. వరుసగా సినిమాలు అపజయాలు అవుతున్న సమయంలో మా అభిమాన హీరో సినిమా అవకాశం వస్తే లక్కీగా భావించి చేయాలి కానీ తిరస్కరిస్తారా? అంటూ విజయ్ అభిమానులు శ్రీలీలపై సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ సినిమా విషయంలో దర్శకుడు వెంకట ప్రభు కానీ, నిర్మాతలు కానీ తనను సంప్రందించలేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఈ విషయంలో శ్రీలీల మాత్రం అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు.