16 August, 2026 | 8:10 PM

‘ఎల్2ఈ ఎంపురాన్’ టీజర్ వచ్చేసింది

27-01-2025 12:00 AM

నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఎల్2ఈ ఎంపురాన్’ ఈ సినిమాలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ‘లూసిఫర్’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతోంది. ఈ సినిమా ఈ ఏడాది మార్చి 27న విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ఆదివారం సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్‌ను కొచ్చిలో నిర్వహించారు. ప్రముఖ నటుడు మమ్ముట్టి టీజర్‌ను విడుదల చేశారు. మోహన్‌లాల్ యాక్షన్ సన్నివేశాలతో టీజర్‌ను రూపొందించారు. ‘లూసిఫర్’ మంచి విజయం సాధించడంతో సీక్వెల్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఈ చిత్రంలో టొవినో థామస్, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్, సానియా అయ్యప్పన్, సాయి కుమార్, సచిన్ ఖేడేకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాయి.