బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్
27-02-2026 09:05 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, శుక్రవారం సాయంత్రం, బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించి కలెక్టర్ అభిలాష అభినవ్ ను తన ఛాంబర్ లో పూల మొక్కను అందించి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్, అదనపు కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.




