calender_icon.png 19 January, 2026 | 10:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సౌత్ క్యాంపస్ అధ్యాపకునికి సన్మానం

19-01-2026 08:54:04 PM

జాతీయ సెమినార్ లో అవార్డు అందుకున్న అధ్యాపకుడు

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిక్నూర్ సౌత్ క్యాంపస్ అధ్యాపకుడు బందెల అంజయ్య జాతీయస్థాయి అవార్డు అందుకున్నారు. ఈనెల 10న ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్ ఆధ్వర్యంలో భువనేశ్వర్ లో ఈనెల పదిన నిర్వహించిన సెమినార్ లో పాల్గొన్న డాక్టర్ అంజయ్య పచ్చని భవిష్యత్తు దిశగా పునర్నిర్మాణం అనే అంశంపై జాతీయ సెమినార్ లో వివరించారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న మేధావులు తమ అభిప్రాయాలను వ్యక్తం పరిచారు.

వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన మేధావులకు అవార్డు లతో సత్కరించారు. కామారెడ్డి జిల్లా నుంచి పాల్గొన్న సౌత్ క్యాంపస్ అధ్యాపకుడు బందెల అంజయ్యను భారత్ వికాస్ అవార్డు ను అందజేశారు. దీన్ని పురస్కరించుకొని సోమవారం సౌత్ క్యాంపస్లో ప్రిన్సిపల్ సుధాకర్ గౌడ ఆధ్వర్యంలో అధ్యాపకులు అంజయ్యను ఘనంగా సన్మానించారు. అంజయ్య ను ఆదర్శంగా తీసుకొని మిగతా అధ్యాపకులు స్ఫూర్తిగా  తీసుకొని భవిష్యత్తులో అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు.