9 May, 2026 | 1:37 PM

Breaking News

తమిళనాడులో రాజకీయ సంక్షోభం.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు   •   నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి   •  

ప్రశాంతంగా గ్రామ పాలన అధికారి పరీక్ష

26-05-2025 01:28 AM

డీఆర్‌ఓ భుజంగరావు 

మెదక్, మే 25(విజయక్రాంతి): మెదక్ జిల్లాలో ప్రశాంతంగా ఆదివారం నాడు గ్రామ పాలన అధికారి పరీక్ష నిర్వహించడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి భుజంగరావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన  గ్రామ పాలన అధికారి పరీక్షా కేంద్రాన్ని సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలో గ్రామ పాలన అధికారి పరీక్షలు పగడబ్బందిగా నిర్వహించినట్టు  తెలిపారు. డిగ్రీ కళాశాలలో 104 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 79 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. 25 మంది అనివార్య  కారణాలవల్ల అభ్యర్థులు పరీక్షకు హాజరు కాలేదని చెప్పారు.

పరీక్ష రాసేందుకు వీలుగా తరగతి గదుల్లో బెంచీలు, లైటింగ్, ఫ్యాన్లు, తాగునీరు, మూత్రశాలలు, తదితరాల వంటి మౌలిక వసతులను సమకూర్చినట్లు వివరించారు. పోలీస్ యంత్రాంగం పటిష్ట భద్రత ఏర్పాటు చేశారని చెప్పారు. మెదక్ ఆర్డీవో రమాదేవి,కలెక్టరేట్ ఏవో యూనస్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ హుస్సేన్, తహసిల్దార్ లక్ష్మణ్ బాబు, సంబంధిత పోలీస్ యంత్రాంగం పాల్గొన్నారు.