calender_icon.png 29 May, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామపాలన అధికారి పరీక్ష ప్రశాంతం

26-05-2025 01:29:39 AM

జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు 

సంగారెడ్డి, మే 25(విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ తార డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన గ్రామ పాలన అధికారి పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, అదనపు కలెక్టర్  మాధురితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ తార డిగ్రీ, కళాశాలలో గ్రామ పాలన అధికారి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించినట్టు తెలిపారు.

మొత్తం అభ్యర్థులు 265 గాను 250 మంది పరీక్షకు హాజరు కాగా 15 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. ఈ పరిశీలన కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.