30 May, 2026 | 7:50 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ హరిత   •   సీఎం రేవంత్ రెడ్డికి చేరిన సిద్ధాపూర్ డంప్ యార్డ్ వ్యవహారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీతో లబ్ధిదారుల్లో ఆనందం   •   బాలికలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి   •   ఉపాధ్యాయుని సేవలు ప్రజలు మరిచిపోలేరు: ఎమ్మెల్యే   •   వెల్నెస్ హాస్పిటల్ 8వ బ్రాంచ్ ను ఘనంగా ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని   •   అసమర్ధత కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేయకుండా కాలయాపన చేస్తుంది   •   మహిళా శక్తి సూపర్ మార్కెట్లు ఏర్పాట్లు చేస్తాం   •   మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలి   •   విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దు ఎంపీడీవో   •  

తంగళ్ళపల్లిలో రోడ్డు భద్రతపై గ్రామసభ - అవగాహన కార్యక్రమాలు

13-04-2026 03:30 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తంగళ్ళపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశంలో రోడ్డు భద్రతపై పాటించాల్సిన నియమాలు, ప్రమాదాలు నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా చర్చించారు. ఈ సందర్భంగా తంగళ్ళపల్లి ఎస్సై ఉపేంద్ర చారి ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనం నడపాలి.

ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా ప్రాణాలను రక్షించుకోవచ్చని తెలిపారు. రోడ్డు భద్రతపై ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు 9 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సభ్యులు గ్రామంలోని ప్రతి ఒక్కరికీ రోడ్డు భద్రతపై అవగాహన పెంచే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.