28 August, 2026 | 7:54 PM

Breaking News

ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉద్యమిద్దాం   •   విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి   •   డ్రై ఫ్రూట్స్‌తో రాఖీలు తయారు చేసిన చిన్నారి   •   ఏఐవైఎఫ్ మానుకోట జిల్లా నూతన కమిటీ ఎన్నిక   •   మెడినోవా ఆసుపత్రిలో ఎన్ఐసీయు వైద్య సేవలు   •   ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడిని అరికట్టాలి   •   రాష్ట్ర స్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీల్లో పారమిత విద్యార్థులకు పతకాలు   •   రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన గురుకుల డిగ్రీ అథ్లెటిక్స్ అకాడమీ క్రీడాకారిణిలు   •   మార్కండేయ మందిరంలో ఘనంగా నూలు పున్నమి ఉత్సవాలు   •   ఘనంగా గంగా మాత విగ్రహ ప్రతిష్టాపన   •  

ఘనంగా గంగా మాత విగ్రహ ప్రతిష్టాపన

28-08-2026 07:22 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శుక్రవారం ఘనంగా శ్రీ గంగా మాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. వేద పండితుల చేత హోమాలు, పూజలు నిర్వహించి ఘనంగా గంగా మాత విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 2000 మందికి మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన గంగపుత్ర మహిళలు గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే  భూక్య మురళి నాయక్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు భూక్య ఉమ, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, మాజీ ఎంపీ మాలోత్ కవిత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని పట్టణ గంగపుత్ర సంఘం జిల్లా గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించగా,

ఈ కార్యక్రమంలో జిల్లా గంగపుత్ర సంఘం అధ్యక్షులు మైసా నాగయ్య, గౌరవ అధ్యక్షులు డాక్టర్ డోలి సత్యనారాయణ, పట్టణ గంగపుత్ర సంఘ అధ్యక్షులు దేశబోయిన వెంకటస్వామి, కార్యదర్శి ఉపేందర్, ట్రెజరర్ దేశ బోయిన అనిల్, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు చిట్యాల జనార్ధన్, ఎండి ఖలీల్, ఎండి ఫరీద్, నిమ్మల శ్రీనివాస్, బోళ్ళ రాజు, వడ్డే బోయిన శ్రీనివాస్, డాక్టర్ గుడి బోయిన గోపీనాథ్, మద్దర్ల రాజన్న, చుక్కల పరమేశ్వర్, దేశ బోయిన  రవి, చుక్కల నాగయ్య, డోలి కృష్ణ, చుక్కల నరేష్  తదితరులు పాల్గొన్నారు.