16 March, 2026 | 9:41 AM

గ్రామాల అభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి

16-03-2026 12:00 AM

చిన్నంబావి,మార్చి 15: గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర అబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మండల పరిధిలోని పెద్దమారుర్ గ్రామంలో ఆదివారం ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్) నిధులతో చేపట్టనున్న రూ.21 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలన్నదే ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. గ్రామాల్లో అంతర్గత రోడ్లు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. గతంలో పెండింగ్లో ఉన్న పనులను దశలవారీగా పూర్తి చేస్తూ గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేస్తున్నామని అన్నారు.

పనుల అమలులో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశించారు. పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ పూర్తి చేయాలని సూచించారు. గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, గ్రామ సర్పంచ్ కేతపాగ జయమ్మ,విద్యాసాగర్ రావు,నర్సింహారెడ్డి,మోహన్,రాజ్ కుమార్, నరేష్,మద్దిలేటి, లోకేష్ పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.