ఎమ్మెల్యే పాయం చొరవతో గ్రామాల అభివృద్ధి
02-04-2026 12:00 AM
బూర్గంపాడు,ఏప్రిల్ 1 (విజయక్రాంతి): పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చొరవతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని బూర్గంపాడు సర్పంచ్ మందా నాగరాజు, ఉప సర్పంచ్ గుండె వెంకన్న అన్నారు.బుధవారం బూర్గంపాడు గ్రామపంచాయతీ పరిధిలో సుమారు రూ.50లక్షల వ్యయంతో నిర్మించనున్న పలు సీసీ రోడ్లు,డ్రైనేజి నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ ప్రభాకర్, పిఆర్ ఏఈ చక్రధర చారి,నాయకులు భజన సతీష్ కుమార్, చిప్పా రాజు,ప్రవీణ్ ,భజన ప్రసాద్,పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.




