2 April, 2026 | 3:15 AM

సమస్య ఏదైనా పరిష్కారం చూపుతాం

02-04-2026 12:00 AM

ఎస్పీ జానకి షర్మిల 

భైంసా, ఏప్రిల్ 1 (విజయక్రాంతి) : జిల్లా శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు ఏ ఇబ్బందులు వచ్చినా పోలీస్ సహాయాన్ని పొందవచ్చని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. బుధవారం బైంసా పట్టణంలో పోలీసు ప్రజావాణి నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించి వాటిని పరిష్కరించాలని పోలీసులకు సూచించారు. జిల్లా పోలీస్ ప్రజావాణి వచ్చిన అర్ధిదారులకు కౌన్సిలింగ్ నిర్వహించి కుటుంబాలను ప్రశాంత వాతావరణంలో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ పోలీసులు సిబ్బంది ఉన్నారు